భారతదేశం, ఏప్రిల్ 8 -- వ్యవసాయంలో రైతులకు మద్దతుగా నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం సరికొత్త వ్యవస్థను తీసుకురానుంది. ప్రధానంగా భూసార పరీక్షలు, ఎరువుల వినియోగంపై అవగాహన కల్పించటమే లక్ష్యంగా వాలంటీర్ల వ్యవస్థను తీసుకురానుంది. ఇందుకోసం 30 వేల మందిని ఎంపిక చేసి శిక్షణ ఇస్తుంది.
రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం... రైతులకు ఉపయోగపడేలా సాయిల్ హెల్త్ వాలంటీర్లను తీసుకురానున్నారు. ప్రతి గ్రామానికి ముగ్గురిని నియమిస్తారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 30 వేల మంది సేవలు అందిస్తారు. విడతల వారీగా వీరిని ఎంపిక చేసి శిక్షణ ఇస్తారు.
తాజాగా ఇక్రిశాట్ లో తొలి విడతగా వాలంటీర్లకు శిక్షణ(సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్) ఇచ్చే కార్యక్రమాన్ని తుమ్మల ప్రారంభించారు. ఇక్రిశాట్, తెలంగాణ వ్యవసాయ శాఖ ఈ వాలంటీర్లను నియమించనుంది. పైలెట్ ప్రాజెక్ట్ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.