భారతదేశం, ఫిబ్రవరి 7 -- రాష్ట్రంలోని కార్పొరేషన్, మున్సిపాలిటిల్లో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. షెడ్యూల్ ప్రకారం. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయింది. దీంతో బరిలో నిలిచిన అభ్యర్థులు తేలిపోయారు. ప్రస్తుతం ప్రచారం నడుస్తోంది.

ఈనెల 11వ తేదీన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. అయితే ఆయా వార్డుల్లో బరిలో ఉన్న అభ్యర్థుల వ్యక్తిగత, విద్యా అర్హత, ఆస్తులు, అప్పులు, నేర చరిత్ర వివరాలను ఎన్నికల సంఘం అందుబాటులోకి తీసుకొచ్చింది. అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్లను ఈసీ వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి. వీటిలో పోటీ చేస్తున్న అభ్యర్థి పూర్తి వివరాలు నిక్షిప్తమై ఉన్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిల్లో 2,996 వార్డులు, డివిజన్లు ఉన్నాయి. 2,996 వార్డులకుగానూ 12,993 మంది పోటీలో నిలిచా...