భారతదేశం, ఆగస్టు 8 -- తెలంగాణలో ఆషాఢ మాసంలో ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే బోనాల పండుగ విశిష్టతను ఈ కథనం వివరిస్తోంది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు తెలంగాణలోని ప్రజలు గ్రామ దేవతలకు బోనాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. బోనం అంటే ఏమిటి, దానిని ఎలా తయారు చేస్తారు?

బోనాల పండుగ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆషాఢ మాసం వస్తే చాలు, తెలంగాణలో బోనాలను జరుపుతారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు ఆ అమ్మ నామస్మరణతో మారుమోగుతాయి. గ్రామ దేవతలకు ప్రతి ఒక్క మహిళ కూడా బోనాలను సమర్పిస్తారు. అసలు బోనం అంటే ఏంటి? దానిలో ఏముంటుంది? బోనాల విశిష్టత గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం.

భోజనం అనే సంస్కృత పదానికి వికృతి పదమే బోనం. ఇంట్లోనే అమ్మవారికి భోజనాన్ని తయారు చేసి, దానిని నివేదన చేయాలి. ప్రపంచంలో ఎక్కడా కనిపించని సంప్రదాయం కేవలం తెలం...