భారతదేశం, జనవరి 27 -- మాదకద్రవ్యాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రాజీలేని వైఖరితో ఉందని ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఎక్సైజ్ సిబ్బందికి తుపాకులు జారీ చేయాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తగిన సంప్రదింపుల తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల పదార్థాలను అరికట్టడంతో పాటుగా ఎక్సైజ్ శాఖ సిబ్బంది సేఫ్టీని నిర్ధారించడం కోసం తుపాకులు ఇచ్చే ఆలోచన ఉందన్నారు.

గంజాయి స్మగ్లర్లను పట్టుకునే ప్రయత్నంలో గాయాలపాలై నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను పరామర్శించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. 'రాష్ట్రవ్యాప్తంగా నిఘాను ముమ్మరం చేశాం. ఫలితంగా ఇటీవలి కాలంలో 2,457 మందిపై 1,354 కేసులు నమోదు చేయగా, 5,196 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నాం. సౌమ్యపై దాడి జరిగిన నిజామాబాద...