భారతదేశం, సెప్టెంబర్ 15 -- పేదలకు అండగా నిలిచే ఆరోగ్య శ్రీ సేవలను నిరవధికంగా వాయిదా పడనున్నాయి. తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ (TANHA) సెప్టెంబర్ 16 అర్ధరాత్రి నుండి ఆరోగ్యశ్రీ పథకం కింద సేవలను నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. గత 20 రోజులుగా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహా, ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ అధికారులతో అసోసియేషన్ అనేక దఫాలుగా చర్చలు జరిపింది. ఈ సమస్యను చిత్తశుద్ధితో పరిశీలిస్తున్నామని మంత్రి హామీ ఇచ్చినప్పటికీ చెల్లింపుల పంపిణీలో జాప్యం కొనసాగుతుందని టీఏఎన్‌హెచ్‌ఏ అధ్యక్షుడు వడ్డిరాజు రాకేష్ తెలిపారు.

పెండింగ్‌లో ఉన్న బిల్లులు వెంటనే విడుదల చేయాలని అసోసియోషన్ డిమాండ్ చేస్తోంది. పదే పదే హామీ ఇచ్చినప్పటికీ పెండింగ్‌లో ఉన్న చెల్లింపులను విడుదల చేయడంలో జాప్యం జరుగుతుందని సేవలను నిలిపివస్తు...