భారతదేశం, జూన్ 16 -- రాష్ట్రంలో ప్రభుత్వ విద్యకు కొత్త దిశను చూపించే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా విద్యా సంస్కరణలు చేపట్టిన ప్రజా ప్రభుత్వం తొలి అడుగుగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌కు నాంది పలికింది. సీఎం రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ (TPS)ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూన్ 17న ఆరుట్లలో ఉదయం 9.30 గంటలకు ప్రారంభిస్తారు. రాష్ట్రంలోని కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా అత్యాధునిక వసతులతో రూపొందిన టీపీఎస్ తెలంగాణ విద్యా రంగంలో నూతన విద్యా విప్లవానికి శ్రీకారం చుట్టనుంది.

రాష్ట్రంలోని కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా ప్రభుత్వ విద్యను అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేసి విద్యారంగ బలోపేతానికి సూచనలు తీసుకున్నారు....