భారతదేశం, సెప్టెంబర్ 25 -- తెలంగాణలో గ్రూప్ 1 ఫలితాలు విడుదల అయ్యాయి. 562 గ్రూప్ 1 సర్వీసుల పోస్టులకు అభ్యర్థుల జాబితాను బుధవారం అర్ధరాత్రి టీజీపీఎస్సీ ప్రకటించింది. అభ్యర్థులు ఎంపిక చేసుకున్న పోస్టుల ప్రాధాన్య క్రమం, ప్రధాన పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్, రిజర్వేషన్, ఆధారంగా ఆయా పోస్టులకు ఎంపికైన వారి వివరాలను ప్రకటించింది. మెుత్తం 563 పోస్టుల్లో 562 మందిని ఎంపిక చేసింది.

గ్రూప్ 1లో టాప్ 10 ర్యాంకులు సాధించిన అభ్యర్థులు ఆర్డీవో పోస్టులను ఎంపిక చేసుకున్నాని టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం వెల్లడించారు. టాప్ 10 ర్యాంకులు చూస్తే.. లక్ష్మీదిపిక, దాడి వెంకటరమణ, వంశీకృష్ణారెడ్డి, జిన్నా తేజస్విని, కృతిక, హర్షవర్ధన్, అనూష, నిఖిత, భవ్య, శ్రీకృష్ణసాయి ఉన్నారు. అయితే తుది ఎంపికలు హైకోర్టు తుదితీర్పునకు లోబడి ఉంటాయని టీజీపీఎస్సీ ప్రకటించింది....