భారతదేశం, జనవరి 20 -- 2025 జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్‌సీ) పొందిన చిత్రాలకు 'తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ (TGFA)' నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నోటిఫికేషన్ జారీ చేసింది. జాతీయ సమైక్యతపై చలనచిత్రాలు, పర్యావరణం, వారసత్వం, చరిత్రపై చలనచిత్రాలు, తొలి చలనచిత్రాలు, మంచి వినోదం ఆధారంగా రూపొందించిన చిత్రాల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. వివిధ విభాగాల కింద తెలుగు చిత్రాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న చలనచిత్ర నిర్మాతలు, ప్రభుత్వ సంస్థల నుండి ఎంట్రీలను కార్పొరేషన్ ఆహ్వానించింది.

నోటిఫికేషన్ ప్రకారం, సామాజిక సందేశం కలిగిన ఫీచర్ ఫిల్మ్‌లు, యానిమేషన్ చిత్రాలు, స్పెషల్ ఎఫెక్ట్స్ చిత్రాలు, పిల్లల చిత్రాల...