భారతదేశం, సెప్టెంబర్ 18 -- రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ, తెలంగాణ(SLTA-TG) ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు చక్రవర్తుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కె. గౌరీ శంకర్ రావులు ఒక ప్రకటనలో తెలిపారు. 33 జిల్లాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ అవకాశం ఉందన్నారు. 6వ తరగతి నుండి పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు ఈ ఛాన్స్ ఉంటుంది.

కమిటీ నిర్ణయించిన అంశమైన 11 మంది తెలంగాణ కవులపైన వ్యాసం రాయాల్సి ఉంటుంది. ఆ కవులు, 1.బమ్మెర పోతన 2.దాశరధి కృష్ణమాచార్య 3.సుద్దాల హనుమంతు 4.వట్టి కోట ఆళ్వార్ స్వామి 5.వానమామలై వరదాచార్యులు 6.సురవరం ప్రతాపరెడ్డి 7.సామల సదాశివ 8.బోయ జంగయ్య 9.పాకాల యశోద రెడ్డి 10.కాళోజీ నారాయణరావు 11.డాక్టర్ సి.నారాయణరెడ్డి.

పాఠశాల స్థాయిలో కవుల గురించి వ్యాసరచన పోటీ పెట...