Telangana, ఆగస్టు 29 -- తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ(టాస్‌) ఆధ్వర్యంలో నిర్వహించే టెన్త్, ఇంటర్‌ పరీక్షలపై కీలక అప్డేట్ వచ్చేసింది. సెప్టెంబర్ సెషన్ పరీక్షల తేదీలను ప్రకటించారు. సెప్టెంబరు 22 నుంచి 28వ తేదీ వరకు ఈ ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు.

థియరీ పరీక్షలు రెండు సెషన్‌లలో నిర్వహిస్తారు. మొదటి సెషన్ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. ఇక రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతుందని ప్రకటలో పేర్కొన్నారు. ఇక ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు అక్టోబర్ 6వ తేదీన ప్రారంభమవుతాయి. అక్టోబర్ 13వ తేదీతో అన్ని పరీక్షలు ముగుస్తాయి.

ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు త్వరలోనే అందుబాటులోకి వస్తాయి. https://www.telanganaopenschool.org/ వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవాలి.

Published by H...