భారతదేశం, జూలై 13 -- తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన జర్నలిస్టులు, ఉద్యమకారులకు తగిన గుర్తింపు ఇవ్వాలని తెలంగాణ జర్నలిస్టుల ఫోరం (TJF) కోరింది. ఇందులో భాగంగా టీజేఎఫ్ ప్రతినిధులు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, సంక్షేమ కమిటీ కో చైర్మన్, శాసనమండలి సభ్యులు (ఎమ్మెల్సీ) ప్రొఫెసర్ కోదండరాంను సోమవారం కలిశారు. ఉద్యమకారుల గుర్తింపు, సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.

టీజేఎఫ్ అధ్యక్షుడు పల్లె రవికుమార్ నేతృత్వంలోని కమిటీ కార్యవర్గ సభ్యులు ఈ భేటీలో పాల్గొని.. జర్నలిస్టుల, ఉద్యమకారుల సమస్యలపై సమగ్ర ప్రతిపాదనలతో కూడిన వినతి పత్రాన్ని కోదండరాంకు అందజేశారు. ఈ సమావేశం సందర్భంగా తెలంగాణ మలిదశ ఉద్యమ కాలం నాటి క్షేత్రస్థాయి పరిస్థితులను ఫోరం ప్రతినిధులు కో చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. స్వరాష్...