భారతదేశం, డిసెంబర్ 31 -- వచ్చే విద్యా సంవత్సరం 2026-27 నుండి తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్(TG BIE) సిలబస్‌లో మార్పులు చేయనుంది. సిలబస్ సవరణను చేపడుతోంది. గణితం, కెమిస్ట్రీ, కొన్ని సబ్జెక్టులలో మార్పులు చేస్తారు. దీంతో విద్యార్థులకు కాస్త భారం తగ్గనుంది.

తెలుగు భాష, చరిత్ర విషయానికొస్తే తెలంగాణ చరిత్ర, సంస్కృతికి సంబంధించిన పాఠాలపై ఎక్కువ ప్రాధాన్యత పెరుగుతోంది. జేఈఈ, NEET UG వంటి వివిధ పోటీ ప్రవేశ పరీక్షలకు అనుసరించే NCERT సిలబస్ ఆధారంగా బోర్డు ఈ మార్పులను చేస్తోంది. 2026-27 విద్యా సంవత్సరానికి సిలబస్ సవరణను చేపట్టిన బోర్డు.. కఠినంగా ఉన్న కొన్ని గణితం 1B అంశాలను తొలగించింది. అంతేకాదు కెమిస్ట్రీ భాగాన్ని దాదాపు 30 శాతం తగ్గించగా, కొన్ని సబ్జెక్టులలో 20 శాతం కోత విధించారు.

ఇంటర్‌లో మ్యాథ్స్ ఏ, మ్యాథ్స్ బీ పేపర్లు 75 మార్కుల చ...