భారతదేశం, ఏప్రిల్ 23 -- తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 22వ తేదీ నుంచి సమ్మె నడుస్తోంది. బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. మరోవైపు ఆర్టీసీ ఉద్యోగులు చాలా చోట్ల నిరసనలు చేపట్టారు. అయితే నిరసనలో భాగంగా వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న కోలా శంకర్ గౌడ్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకుండా కాలయాపన చేయడాన్ని నిరసిస్తూ.. నర్సంపేట బస్టాండ్ ఎదుట శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆయనను వరంగల్‌లోని ఆసుపత్రికి తరలించారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....