భారతదేశం, డిసెంబర్ 29 -- డిసెంబర్ 29న తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో ఎక్కువగా నీటిపారుదల సమస్యలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణ, గోదావరి నదీ జలాలపై చర్చ జరగనుంది. డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు జరగవు. జనవరి 2న తిరిగి ప్రారంభమవుతాయి.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీకి చేరుకున్నారు. కేబినెట్ మంత్రులు, సీనియర్ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. కేసీఆర్ వద్దకు రేవంత్ రెడ్డి వెళ్లి బాగున్నారా అని పలకరించారు. ఆరోగ్య పరిస్థితి గురించి అడిగారు. మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, సీతక్క, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కేసీఆర్‌ను పలకరించి అభివాదం చేశారు.

రెండేళ్ల తర్వాత బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ శాసనసభ సమావేశాలకు హాజరయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి ఉదయం అసెంబ్లీ ప్...