భారతదేశం, సెప్టెంబర్ 28 -- తెలంగాణ రాష్ట్రంలో అబ్కారీ శాఖ కీలక వార్త అందించింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 41 '2బీ' కేటగిరీ బార్ (బార్ అండ్ రెస్టారెంట్)ల ఏర్పాటుకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ కమిషనర్ హరికిరణ్ తెలిపారు.

రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు, సమీప గ్రామాల విలీనం, జనాభా పెరుగుదల, నూతనంగా ఏర్పాటైన క్యూర్‌ పరిధిని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. క్యూర్‌ పరిధిలో 14 బార్లు (గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్‌గిరి ప్రాంతాలు), ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 27 బార్లకు దరఖాస్తులు కోరుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో 1,131 బార్లు అందుబాటులో ఉండగా, గత ఏడాది 14 కొత్త బార్లకు అనుమతి ఇచ్చారు. ఇప్పుడు అదనంగా మర...