Telangana,hyderabad, ఆగస్టు 2 -- గత కొద్ది నెలలుగా తెలంగాణ ఏసీబీ దూకుడుగా ముందుకెళ్తోంది. అవినీతి అధికారులను పక్కాగా పట్టేసుకునే పనిలో ఉంటోంది. గతేడాది కూడా భారీగానే కేసుల సంఖ్య నమోదైంది. ఈ ఏడాదిలోనూ ఎక్కువ సంఖ్యలోనే అధికారులు, సిబ్బంది చిక్కుతున్నారు. జనవరి నుంచి జూలై నెల వరకు నమోదైన కేసుల వివరాలను ఏసీబీ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.

తెలంగాణ అవినీతి నిరోధక శాఖ. (ఏసీబీ) జూలైలో 13 ట్రాప్ కేసులు నమోదు చేసింది. అంతేకాకుండా ఒక ఆదాయానికి మించిన ఆస్తుల కేసు, ఒక క్రిమినల్ దుష్ప్రవర్తన కేసు, ఒక సాధారణ విచారణ, ఆరు ఆకస్మిక తనిఖీలతో సహా మొత్తం 22 కేసులను నమోదు చేసింది.

ఇద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు/ప్రైవేటు వ్యక్తులతో సహా 20 మంది ప్రభుత్వ ఉద్యోగులను ట్రాప్ చేసి అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఏసీబీ అధికారి ఒకరు తెలిపారు. వివిధ శాఖల ట్రాప్ క...