భారతదేశం, నవంబర్ 16 -- పర్యాటకులకు సౌకర్యవంతమైన వసతి కల్పించడానికి, స్థానిక ఆచారాలు, సంప్రదాయాలను అనుభవించడంలో టూరిస్టులకు సహాయపడటానికి తెలంగాణ ప్రభుత్వం హోమ్ స్టేలను తీసుకొస్తుంది. ఇందులో భాగంగా టూరిస్టులతో తెలంగాణ వంటకాలను కూడా ఆస్వాదించేలా చేయనుంది. తెలంగాణ ఆచారాలు, సంప్రదాయాలను ప్రపంచ స్థాయి టూరిస్టులకు పరిచయం చేయనుంది. అంతేకాదు ఈ హోమ్ స్టేల ద్వారా స్థానికులకు ఉపాధి దొరకనుంది.

ఈ హోమ్ స్టేలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రైవేట్ పెట్టుబడిదారులు, వ్యక్తుల నుండి దరఖాస్తులను ఆహ్వానించింది. దీనిని రెండు కేటగిరీలుగా వర్గీకరించింది. సిల్వర్ కేటగిరీకి రూ.2,000, గోల్డ్ కేటగిరీకి రూ.4,000గా ప్రభుత్వం నిర్ణయించింది. డిమాండ్ డ్రాఫ్ట్‌లను 'కమిషనర్/డైరెక్టర్ ఆఫ్ టూరిజం, తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్' అనే చిరునామాకు చెల్లించాలి.

ఆసక్తి ఉన్న వ్యక్...