భారతదేశం, జూలై 12 -- తెలంగాణ రాష్ట్రాన్ని దేశీయ, అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం సరికొత్త పర్యాటక అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేస్తోంది. కొత్త పర్యాటక ప్రాంతాల గుర్తింపు, సందర్శకులకు అంతర్జాతీయ స్థాయి వసతుల కల్పన, ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సరికొత్త వ్యూహాన్ని రచిస్తోంది.

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, రుచులు, హస్తకళలు, జానపద కళలు, అద్భుతమైన వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకు గ్రాండ్ టూరిజం కార్నివాల్ నిర్వహించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దుబాయ్‌లోని ప్రసిద్ధ 'గ్లోబల్ విలేజ్' స్ఫూర్తితో ఈ కార్నివాల్‌ను ప్రతి ఏటా ఒక మహా ఈవెంట్‌లా నిర్వహించి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులను ఆకర్షించాలని ప్రణాళికలు వేస్తోంది.

భాగ్యనగరానికి వచ్చే పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు నైట్ టూరిజం, హెరిట...