భారతదేశం, జూన్ 6 -- తెలంగాణలో పర్యాటకరంగాన్ని సరికొత్త ఎత్తులకు తీసుకెళ్లేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ కీలక అడుగులు వేస్తోంది. కేంద్ర ప్రభుత్వ నిధులను అందిపుచ్చుకుంటూ రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి పర్యాటక జోన్‌లను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా వికారాబాద్, యాదగిరిగుట్ట, మరియు నాగార్జున సాగర్ సమీపంలోని బుద్ధవనం ప్రాంతాలను ప్రాథమికంగా ఎంపిక చేసినట్లు సమాచారం.

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'డెవలప్‌మెంట్ ఆఫ్ ఐకానిక్ టూరిస్ట్ సెంటర్స్ టు గ్లోబల్ స్కేల్' (అంతర్జాతీయ స్థాయిలో ఐకానిక్ పర్యాటక కేంద్రాల అభివృద్ధి) ప్రాజెక్టు కింద ఈ మూడు ప్రాంతాలలో ఒకదానిని ఎంపిక చేయనున్నారు. వికారాబాద్, యాదగిరిగుట్ట, నాగర్జునసాగర్‌లను షార్ట్ లిస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది.

ఇందులోని ఎంపికైన ఆ ఒక్క పర్యాటక కేంద్రాన్ని సుమారు ర...