భారతదేశం, జూలై 1 -- తెలంగాణలో మంగళవారం, బుధవారం వర్షాలు పడనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరికొన్ని రోజులకు సంబంధించిన వాతావరణ బులెటిన్ విడుదల చేసింది. 3,4 తేదీల్లో వర్ష తీవ్రత పెరిగే అవకాశం ఉందని తెలిపింది.

జులై 1వ తేదీన కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కుమురం భీం ఆసీఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, వరంగల్, హన్మకొండతోపాటుగా మరికొన్ని జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది.

జులై 4వ తేదీవరకు వర్షాలు పడే అవకాశం ఎక్కువగా ఉంది. జులై 3, 4వ తేదీల్లో తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడని వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ రెండు రోజులు వానలు ఎక్కువ...