భారతదేశం, డిసెంబర్ 14 -- నేడు తెలంగాణలో జన్మించిన బిడ్డ మునుపటి తరం కంటే చాలా ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంది. 2036 నాటికి తెలంగాణలో పురుషుడి సగటు ఆయుర్దాయం 71.40 సంవత్సరాలు ఉంటుందని అంచనా. అయితే మహిళలు 75.60 సంవత్సరాల సగటు ఆయుర్దాయంతో మరింత మెరుగ్గా ఉంటారు.

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, జాతీయ జనాభా కమిషన్ 'జనాభా అంచనా నివేదిక 2011-2036'లో నమోదు చేసినన ఆయుర్దాయం పెరుగుదల గురించి ఆసక్తిక విషయాలు వెల్లడయ్యాయి. ఆడవారి కంటే మగవాళ్లు తక్కువగా జీవిస్తున్నారు.

తెలంగాణలో పురుషుల సగటు ఆయుర్దాయం 2011-2015 కాలంలో సుమారు 67.10 సంవత్సరాలు ఉండగా, 2031-2035 నాటికి 71.40 సంవత్సరాలకు పెరుగుతుందని అంచనా. అదే కాలంలో స్త్రీల ఆయుర్దాయం దాదాపు 71.10 సంవత్సరాల నుండి 75.60 సంవత్సరాలకు పెరగడంతో వారు మరింత మెరుగ్గా బతుకుతారని భావిస్తున్నారు. అంటే ఇప్పటిద...