తెలంగాణలో భీమ్ యాప్ హవా.. ఎక్కువ పేమెంట్స్ దేనికి చేస్తున్నారో తెలుసా?
భారతదేశం, జూన్ 24 -- నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)కి చెందిన భీమ్(BHIM) పేమెంట్స్ యాప్ లావాదేవీలు గత ఏడాది కాలంలో ఊహించని రీతిలో పెరిగాయి. జూన్ 2025 నుంచి మే 2026 మధ్య కాలంలో భీమ్ యాప్ ద్వారా జరిగిన నెలవారీ లావాదేవీల సంఖ్య ఏకంగా మూడు రెట్లకు పైగా పెరిగినట్లు ఎన్‌పీసీఐ భీమ్ సర్వీసెస్ లిమిటెడ్ వెల్లడించింది.
జూన్ 2025లో భీమ్ యాప్ ద్వారా 7.96 కోట్ల (79.64 మిలియన్) లావాదేవీలు జరగ్గా.. మే 2026 నాటికి ఈ సంఖ్య ఏకంగా 24.4 కోట్లకు (244 మిలియన్) చేరింది. కేవలం మే 2026 ఒక్క నెలలోనే ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా రూ.26,952 కోట్ల విలువైన ఆర్థిక లావాదేవీలు జరగడం విశేషం.
తెలంగాణ రాష్ట్రంలో కూడా భీమ్ యాప్ వినియోగం మూడు రెట్లు పెరిగింది. తెలంగాణ ప్రజలు తమ రోజువారీ అవసరాల కోసం డిజిటల్ చెల్లింపుల వైపు ఎంతలా మొగ్గు చూపుతున్నారో కింద పేర్కొన్న గణాంకా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.