Telangana,hyderabad, ఆగస్టు 13 -- గత కొద్దిరోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం దృష్ట్యా. మరో రెండు మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇప్పటికే వాతావరణశాఖ హెచ్చరికలను జారీ చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లోని పాఠశాలలకు ఇవాళ, రేపు(ఆగస్ట్ 13,14) సెలవులు ప్రకటించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని పాఠశాలలకు ఒంటిపూట బడులు నిర్వహించాలని ఉత్తర్వులు ఇచ్చింది.

ప్రభుత్వ నిర్ణయంతో వరంగల్‌,హన్మకొండ, జనగామ, మహబూబాబాద్‌, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఇక ఇవాళ, రేపు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం హాఫ్ డే స్కూళ్లు ఉండనున్నాయి. మధ్యాహ్నం 12.30 గంటల వరకు మాత్రమే బడులు తెర...