తెలంగాణలో భారీగా పెరిగిన ఇంజినీరింగ్ సీట్లు.. టీజీ ఈఏపీసెట్ వెబ్ ఆప్షన్లలో క్లారిటీ!
భారతదేశం, జూలై 17 -- తెలంగాణలో ఇంజినీరింగ్ విద్యనభ్యసించాలనుకునే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రస్తుత విద్యాసంవత్సరానికి(2026-27) గాను రాష్ట్రంలో బీటెక్ సీట్లు భారీగా పెరగనున్నాయి. శుక్రవారం(జులై 17) నుంచి టీజీ ఎప్‌సెట్ (TG EAPCET) రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ఇందులోనే ఈ అదనపు సీట్లను అందుబాటులోకి తెస్తున్నారు.
ఇటీవలే అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(AICTE) రాష్ట్రంలోని పలు ఇంజినీరింగ్ కళాశాలలకు దాదాపు 15 వేల అదనపు సీట్లను మంజూరు చేసింది. అయితే ఈ సీట్ల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి కావడంతో, గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో విద్యాశాఖ అధికారులు, సీఎంఓ ముఖ్య కార్యదర్శి ఎన్. శ్రీధర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో అదనపు సీట్ల భర్తీకి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.