భారతదేశం, సెప్టెంబర్ 24 -- అనేక మల్టీనేషనల్ కంపెనీలు తెలంగాణలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఈ పెట్టుబడులు యువతకు ఉపాధి అవకాశాలను సృష్టించడమే కాకుండా సబ్సిడీలు, ప్రోత్సాహకాల ద్వారా వ్యవసాయ రంగానికి కూడా ప్రయోజనం చేకూరుస్తాయని ఆయన అన్నారు. పారిశ్రామిక అభివృద్ధిపై జరిగిన క్యాబినెట్ సబ్-కమిటీ సమావేశానికి భట్టి విక్రమార్క అధ్యక్షత వహించారు. దీనికి మంత్రులు శ్రీధర్ బాబు, శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ అధికారులు హాజరయ్యారు.

ఈ సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలపై నివేదికను సమర్పించారు. మహేశ్వరంలో జేఎస్‌డబ్ల్యూ యూఏవీ ప్రైవేట్ కంపెనీ స్థాపనకు కమిటీ ఆమోదం తెలిపిందని తెలియజేశారు. తోషిబా ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ గ్యాస్ ఇ...