భారతదేశం, ఏప్రిల్ 17 -- తెలంగాణలో తీవ్రమైన వడగాలుల పరిస్థితులు నెలకొన్నాయి. ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడంతో పలు జిల్లాల్లో జనాలు ప్రభావితం అవుతున్నారు. రాబోయే ఆరు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. బుధ, గురువారాల్లో పలు జిల్లాల్లో తీవ్రమైన వడగాలుల పరిస్థితులు నమోదవడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై తక్షణ సహాయక చర్యల కోసం ఆదేశాలు జారీ చేసింది.

విపత్తు నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దాన కిషోర్.. జిల్లా కలెక్టర్లను నోడల్ అధికారులుగా నియమిస్తూ.. వైద్య, రెవెన్యూ, పురపాలక, అగ్నిమాపక, కార్మిక శాఖలతో సహా అన్ని విభాగాలను వేడి నివారణ చర్యలను అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. గత ఐదు రోజులుగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో వడగాలుల సంబంధిత అనారోగ్యాల కారణంగా 10 మందికి పైగా మరణించి...