భారతదేశం, జూలై 31 -- నైరుతి రుతుపవనాల సీజన్‌లో అత్యంత కీలమైన జూలై నెల ప్రారంభంలో తీవ్ర నిరాశపరిచినా.. ఆ తర్వాత పుంజుకుని రాష్ట్రంలో వాతావరణాన్ని పూర్తిగా మార్చివేసింది. జూలై నెల మొదట్లో రాష్ట్రంలో వర్షాలు కురవక పోవడంతో తీవ్ర వర్షాభావం ఏర్పడింది. జూలై 16 నాటికి తెలంగాణలో ఏకంగా 61 శాతం మేర భారీ వర్షపాత లోటు ఏర్పడటంతో ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే నెల రెండో భాగంలో రాష్ట్రవ్యాప్తంగా కురిసిన విస్తారమైన వర్షాలతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. నెల ముగిసే సమయానికి వర్షపాత లోటు దాదాపుగా కవర్ అయింది.

తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TGDPS) గణాంకాల ప్రకారం.. సాధారణంగా జూలై నెలలో రావాల్సిన 227.6 మి.మీ. వర్షపాతానికి గాను, ఈ ఏడాది 224.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. అంటే నెల ముగిసేసరికి వర్షపాత లోటు కేవలం 1 శాతానికి మాత్రమే పరిమితమైంది.

జూలై రెం...