భారతదేశం, జూలై 5 -- ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారమే ధ్యేయంగా లెఫ్ట్ (వామపక్ష) విద్యార్థి సంఘాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. విద్యార్థుల హక్కులు, విద్యావ్యవస్థ బలోపేతం కోసం జులై 10వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చాయి. తమ డిమాండ్ల సాధన కోసం విద్యాసంస్థల యాజమాన్యాలు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ బంద్‌కు సహకరించాలని కోరాయి.

ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతుల కల్పన, అందరికీ సమానమైన నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ఈ బంద్ నిర్వహిస్తున్నట్లు విద్యార్థి సంఘాలు ఒక ప్రకటనలో తెలిపాయి. ఆలిండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (AISF), స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI), ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) సంయుక్తంగా ఈ రాష్ట్రవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చాయి.

ప్రభుత్వ వ...