భారతదేశం, నవంబర్ 16 -- రాష్ట్రంలో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతూ పోతోంది. క్రమంగా ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. పలు జిల్లాలో చలిగాలుల తీవ్రత అధికంగా ఉంది. దీంతో జనాలు చలి తీవ్రతకు వణికిపోతున్నారు.

రాబోయే రెండు, మూడు రోజులు సాధారణ స్థాయి కంటే 3 నుంచి నాలుగు డిగ్రీలు రాత్రి ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశాలు ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగానూ పొడి వాతావరణం ఉంటుందని అంచనా వేసింది. ఎలాంటి హెచ్చరికలు లేవని వివరించింది.

తెలంగాణ వెదర్ మ్యాన్ వివరాల ప్రకారం. ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ లో రికార్డు స్థాయిలో 7.4 కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక సంగారెడ్డి జిల్లాలోని కోహిర్ లో 8.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డుయ్యాయి. ఇక హైదరాబాద్ లోని హెచ్ సీయూ వద్ద 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రి వేళలో ...