భారతదేశం, మార్చి 18 -- హైదరాబాద్, మార్చి 18, 2026: భారతదేశంలోనే అతిపెద్ద స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌గా ఎదిగి, త్వరలో 'యూనివర్సల్ బ్యాంక్'గా మారేందుకు ఆర్బీఐ నుంచి ప్రాథమిక అనుమతి పొందిన ఏకైక సంస్థ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (AU SFB). తాజాగా ఈ బ్యాంక్ తెలంగాణ మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలోని హుజూరాబాద్, ఖమ్మం, వేములవాడ ప్రాంతాల్లో తన ప్రత్యేక గోల్డ్ లోన్ బ్రాంచ్‌లను ప్రారంభించడం ద్వారా దక్షిణ భారత దేశంలో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకుంది.

ఇటీవల గుజరాత్‌లో సక్సెస్‌ఫుల్‌గా బ్రాంచ్‌లను ప్రారంభించిన తర్వాత, బ్యాంక్ తన తదుపరి అడుగును తెలంగాణ వైపు వేసింది. ఇందుకు ప్రధాన కారణం ఇక్కడి ప్రజల్లో ఉన్న అధిక బంగారం నిల్వలు మరియు తక్షణ నగదు అవసరాల (లిక్విడిటీ) కోసం పెరిగిన డిమాండ్.

జనవరి 2026 నాటి గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా గోల్...