భారతదేశం, జూన్ 30 -- భారతీ ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త సునీల్ భారతీ మిట్టల్ హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ ఇన్‌స్టిట్యూట్ బోధి పవిలియన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు, డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా సాగిన ఈ ఉన్నత స్థాయి భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రగతిశీల పాలన, పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలు, చారిత్రాత్మక సంస్కరణల వల్ల దేశంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన పెట్టుబడి గమ్యస్థానంగా రాష్ట్రం అవతరించిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఒక భారీ, సమగ్ర డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మౌలిక సదుపాయాల క్యాంపస్‌ను ఏర్పాటు చేసే అవకాశాలను తెలంగాణ అన్వేషిస్తోందన్న...