భారతదేశం, నవంబర్ 13 -- తెలంగాణ ఈసారి అత్యంత చలి తీవ్రత ఎదుర్కోనుంది. భారత వాతావరణ శాఖ (IMD) రాష్ట్రవ్యాప్తంగా రాత్రి ఉష్ణోగ్రతలలో తగ్గుదల గురించి వెల్లడించింది. ఈ సీజన్‌లో తీవ్రమైన చలి ఉంటుందని వెల్లడించింది. వాతావరణ పరిశీలకులు నవంబర్ 13 నుంచి 18 మధ్య గరిష్ట చలిగాలుల గురించి హెచ్చరిస్తున్నారు.

బుధవారం రాష్ట్రంలోని సిర్పూర్ (కుమురం భీమ్) వద్ద 10.2 డిగ్రీల అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ 11.1 డిగ్రీల వద్ద ఉంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంఘం (TGDPS) ప్రకారం, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల 11 డిగ్రీల నుంచి 12డిగ్రీల మధ్య నమోదయ్యాయి. సాధారణ సగటు కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా పడిపోయాయి ఉష్ణోగ్రతలు.

హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు 13 డిగ్రీల నుంచి 15 డిగ్రీల మధ్య ఉన్నాయి. శేరిలింగంపల్లిలో 13.2డిగ్రీలు, సికింద్రాబాద్‌లో ...