భారతదేశం, జూలై 22 -- ఇటీవల ఓ మాలయాళ సినిమాకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అందులో స్కూళ్లో విద్యార్థులు యూ ఆకారంలో కూర్చున్నారు. పాఠశాలల్లో బ్యాక్ బెంచర్ కల్చర్ తొలగించడానికి ఈ సీటింగ్ అమరికను అవలంబిస్తున్నారు.

తెలంగాణలోని జనగాం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు యూ ఆకారపు సీటింగ్‌ను మెుదలుపెట్టాయి. మలయాళ సినిమా స్థానార్థి శ్రీకుట్టన్ ఆధారంగా పాఠశాలలు ఈ సీటింగ్‌ను ఫాలో అవుతున్నాయి. దీనిద్వారా బ్యాక్ బెంచ్ విధానానికి ముగింపు పలుకుతున్నాయి. యూ ఆకారంలో బెంచీలను ఏర్పాటు చేస్తున్నారు. దీనిద్వారా ప్రతీ విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టొచ్చని ఉపాధ్యాయులు చెబుతున్నారు.

'తరగతి గదులను మరింత ఇంటరాక్టివ్‌గా, కలుపుకొనిపోయేలా, ప్రభావవంతంగా మార్చడమే మా లక్ష్యం. యూ సీటింగ్ అంటే విద్యార్థులు ఎలా కూర్చుంటారో మాత్రమే కాదు, వారు ఎలా నేర్చుకుంటా...