భారతదేశం, జూన్ 8 -- తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. ఎండ తీవ్రత, ఉక్కపోతతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు ఉపశమనం కలిగిస్తూ నైరుతి రుతుపవనాలు తెలంగాణను తాకాయి. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే మూడు రోజులు ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.

ఈ ఏడాది దేశంలోకి సకాలంలో ప్రవేశించిన రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఇప్పటికే కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఇవి పూర్తిగా విస్తరించాయి. పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల్లో కూడా దాదాపు 30 శాతం మేర రుతుపవనాలు విస్తరించినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు బంగాళాఖాతంలో ఇవి పూర్తిగా వ్యాపించడంతో, రానున్న 48 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు అనుకూల...