భారతదేశం, అక్టోబర్ 26 -- రాష్ట్రంలో రాబోయే కొన్ని రోజుల్లో వాతావరణం గణనీయంగా మారనుంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.... తుఫాన్(అర్నబ్) ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా అక్టోబర్ 28 నుంచి వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

నేటి నుంచి అక్టోబర్ 27 ఉదయం 08:30 వరకు... ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఈ రెండు రోజులకు ఎటువంటి ముప్పు హెచ్చరికలు లేవు.

అక్టోబర్ 27 ఉదయం 08:30 నుండి అక్టోబర్ 28 ఉదయం 08:30 వరకు చూస్తే... రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, న...