భారతదేశం, సెప్టెంబర్ 15 -- తెలంగాణ చాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ(TCEI) పర్యాటక శాఖతో కలిసి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని అక్షయ కన్వెన్షన్‌లో రెండు రోజులపాటు నాల్గోవ సౌత్ ఇండియా వెడ్డింగ్ ప్లానర్స్ కాంగ్రెస్(SIWPC) నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొని మాట్లాడారు. తెలంగాణను అంతర్జాతీయ స్థాయిలో వెడ్డింగ్ డెస్టినేషన్ గమ్యస్థానాల్లో ఒకటిగా తీర్చిదిద్దడం ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు.

'భారతదేశంలో వివాహ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ విస్తరణలో తెలంగాణ ప్రధాన పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉంది. పురాతన కోటలు, రాజభవనాలు, దట్టమైన అడవులు, నదులు, సరస్సులు, కొండలు, విలాసవంతమైన హోటళ్లతో రాష్ట్రం అన్ని బడ్జెట్ స్థాయిలకు సరిపోయే వెడ్డింగ్ డెస్టినేషన్‌కు అనువైన పరిస్థితులను అందిస్తుంది.'అని మంత్రి జూపల్లి అన్నారు.

తెలంగాణ...