తెలంగాణకు కేసీఆరే ఓజీ.. పవన్ కళ్యాణ్‌కు కేటీఆర్ కౌంటర్
భారతదేశం, జూన్ 3 -- తెలంగాణ రాష్ట్ర వ్యవహారాలను కేసీఆర్ చూసుకుంటారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. సోమాజిగూడలో జరిగిన 'మీట్ ది ప్రెస్' కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రంగా స్పందిస్తూ.. తెలంగాణకు కేసీఆరే ఓజీ(Original Gangster) అని అభివర్ణించారు.
తెలంగాణలో ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయవచ్చని, గతంలో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ పోటీ చేసిందని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం ఎవరి భిక్షా కాదని.. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడి, త్యాగాలు చేసి, రక్తం చిందించిన ఇక్కడి ప్రజలదేనని కేటీఆర్ స్పష్టం చేశారు. 'తెలంగాణ అనేది ఇక్కడి నాలుగు కోట్ల ప్రజల భూమి. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కోసం తమ జీవితాలను అంకితం చేసిన వారిది.' అని ఆయన అన్నారు....
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.