Telangana,andhrapradesh, ఆగస్టు 9 -- దక్షిణ కోస్తాంధ్ర నుండి ఉత్తర శ్రీలంక వరకు తమిళనాడు తీరం మీదుగా ద్రోణి కొనసాగుతోంది. అంతేకాకుండా బుధవారం(ఆగస్టు 13) నాటికి వాయువ్య,దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ ప్రభావంతో.తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతాయని పేర్కొంది.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్(ఆగస్ట్ 09) ప్రకారం.ఇవాళ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చు. నాగర్ కర్నూల్, గద్వాల, వనపర్తి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మరికొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతాయి. 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

రేపు(ఆగస్ట్ 10) ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, మెదక్, కామారె...