భారతదేశం, జూన్ 13 -- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలను వాతావరణం అయోమయానికి గురిచేస్తోంది. భిన్నమైన వాతావరణం ఉంటుంది. శుక్రవారం మధ్యాహ్నం ఎండ దంచికొట్టగా.. రాత్రివరకు చాలా ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. నైరుతి రుతుపవనాల రాకతో కొన్ని ప్రాంతాలు వర్షాలతో తడిసి ముద్దవుతుంటే.. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ఎండ తీవ్రత, వడగాల్పులు జనాన్ని బేజారెత్తిస్తున్నాయి. శని, ఆదివారాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతోందనే దానిపై వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు అత్యంత చురుగ్గా కదులుతున్నాయి. దీనికి తోడు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, అరేబియా సముద్రం నుండి బంగాళాఖాతం వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో రాబోయే రెండు రోజులు తెలంగాణలో భారీ వ...