భారతదేశం, జూన్ 8 -- పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. గత నెల ఎన్నికల పరాజయం తర్వాత టీఎంసీలో అసమ్మతి జ్వాలలు ముమ్మరమ్యాయి. ఏకంగా 20 మంది లోక్‌సభ ఎంపీలు బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) కూటమికి మద్దతు ఇవ్వడానికి సిద్ధమవగా, రాష్ట్ర అసెంబ్లీలో మెజారిటీ ఎమ్మెల్యేలు విడిగా చీలిపోయారు. ఈ తిరుగుబాటు పార్లమెంట్, అసెంబ్లీలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతుందో పరిశీలిద్దాం.

లోక్‌సభలో టీఎంసీ చీఫ్ విప్ కాకోలి ఘోష్ దస్తీదార్ నేతృత్వంలో దాదాపు 20 మంది ఎంపీలు తాము ఎన్‌డీయే (NDA) కూటమికి అధికారికంగా మద్దతు ఇస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.

ప్రస్తుతం లోక్‌సభలో టీఎంసీకి మొత్తం 28 మంది సభ్యులు ఉన్నారు (బసిర్‌హాట్ ఎంపీ హాజీ నూరుల్ ఇస్లాం మరణంతో ఒక స్థానం ఖాళీగా ఉంది). తాజా చీలికతో మమతా బెనర్...