భారతదేశం, నవంబర్ 11 -- తెలంగాణ అంతటా ప్రస్తుతం కొనసాగుతున్న చల్లని రాత్రుల పరిస్థితి రాబోయే కొన్ని రోజుల్లో మారే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉత్తర దిశ నుండి వీచే చల్లని గాలుల స్థానంలో తూర్పు దిశ నుండి వీచే గాలులు రానున్నాయి. తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ(TGDPS) వాతావరణ నిపుణుల అంచనా ప్రకారం ఎల్ నినో పరిస్థితుల ప్రభావంతో మిగిలిన శీతాకాలం అంతగా చలి లేకుండా సాధారణంగా ఉండే అవకాశం ఉంది.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుండి మూడు డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదవుతున్నాయి. ఉత్తర దిశ నుండి వీచే చల్లని గాలుల ప్రభావంతో హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల నుండి 18 డిగ్రీల ​​మధ్య ఉన్నాయి. తెలంగాణలోని ఇతర జిల్లాల్లో 14 డిగ్రీల నుండి 19 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి.

ఇక గరిష్ట ఉష్ణోగ్రతలు సాధా...