భారతదేశం, సెప్టెంబర్ 28 -- జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర గ్రహానికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. శుక్రుడిని సంపద, వైభవం, భోగభాగ్యాలు, ఆకర్షణ, శ్రేయస్సుకు కారకుడిగా భావిస్తారు. జాతకంలో శుక్రుడి స్థానం బలంగా ఉంటే ఆ వ్యక్తి జీవితంలో భౌతిక సుఖ సంతోషాలకు కొదవ ఉండదు. ప్రస్తుతం అస్తమయ స్థితిలో ఉన్న శుక్రుడు, ద్రిక్ పంచాంగం ప్రకారం రాబోయే అక్టోబర్ 30న స్వక్షేత్రమైన తులారాశిలో ఉదయించబోతున్నాడు.

సాధారణంగా శుక్రుడు సూర్యుడికి అత్యంత సమీపంలోకి వచ్చినప్పుడు అస్తమిస్తాడు. అలాగే సూర్యుడికి తగినంత దూరంలోకి వెళ్లినప్పుడు ఉదయిస్తాడు. అక్టోబర్ చివర్లో జరగబోయే శుక్రుడి ఈ ఉదయ ప్రభావం వల్ల ప్రధానంగా 8 రాశుల వారి జాతకాలు పూర్తిగా మారిపోనున్నాయి. ఆయా రాశుల వారికి ఆర్థిక సమస్యలు తొలగిపోయి, నూతన ఆదాయ మార్గాలు సుగమం కానున్నాయి. ఆ అదృష్ట రాశుల వివరాలను ఇప్పుడు పరిశీల...