భారతదేశం, జూలై 28 -- ప్రతి హిందువు ఇంట్లో తులసి మొక్క ఉంటుంది. తులసి మొక్కను ఎంతో పవిత్రంగా భావిస్తారు. లక్ష్మీదేవి తులసి మొక్క ఉన్నచోట ఉంటుందని కూడా నమ్మకం. తులసి మొక్కను రోజూ పూజించి, ప్రతి రోజూ దీపారాధన చేయడం వలన అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు. అయితే ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి.

ఎప్పుడు పడితే అప్పుడు తులసి ఆకులను తుంచకూడదు. విష్ణుమూర్తికి తులసి ఆకులను సమర్పిస్తే అదృష్టం రెట్టింపు అవుతుంది. విష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండొచ్చు. తులసి ఆకులు కోసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి. ఏకాదశి రోజు తులసి మొక్కకు నీళ్లు పోయడం, తులసి ఆకులను తుంచడం వంటివి చేయకూడదు.

తులసి ఆకులను కోయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. మన హిందూ సంప్రదాయం ప్రకారం చూసినట్లయితే, తులసి ఆకులను స్నానం చేసిన తర్వాత మాత్రమే కోయాలి....