భారతదేశం, సెప్టెంబర్ 22 -- హిందువులు తులసి మొక్కను పూజిస్తారు. తులసి కోట ముందు దీపాన్ని వెలిగించి పూజ చేయడం వలన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. తులసిని హిందూ ధర్మంలో పవిత్రమైన మొక్కగా భావిస్తారు. విష్ణువు, కృష్ణుడు, శ్రీరాముడు లాంటి విష్ణు స్వరూపాలకు తులసి దళాలను సమర్పించడం చాలా మంచిదే.

తులసి ఆకులను కోయడానికి ముందు శుభ్రంగా స్నానం చేసి, మంచి దుస్తులు ధరించండి. ఆకులను కోసేటప్పుడు మొక్కకు నష్టం కలగకుండా చూసుకోవాలి. వేళ్లతో మృదువుగా ఆకులను త్రుంచాలి. కొమ్మలను విరిచేయడం, మొక్కను గాయపరచడం మంచిది కాదు. అలాగే తులసి ఆకులను భక్తిశ్రద్ధలతో తీసుకుని పూజకు ఉపయోగించాలి.

సూర్యోదయం తర్వాత ఉదయం సమయంలో తులసి దళాలను సేకరించడం మంచిది. సాయంత్రం, రాత్రిపూట తులసి ఆకులను కోయకూడదని ఆచారం ఉంది. కొన్ని సంప్రదాయాల ప్రకారం చూస్తే ద్వాదశి, అమావాస్య, పౌర్ణమి, సంక్రాంతి...