భారతదేశం, ఏప్రిల్ 30 -- తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణ కార్యాచరణ వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎంసీహెచ్ఆర్డీలో ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు ఆదేశాలిచ్చారు. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ వేంనరేందర్ రెడ్డితో పాటు నీటి పారుదల శాఖకు చెందిన సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

తుమ్మిడిహెట్టిని ఎంత ఎత్తున నిర్మించాలి.. ఎంత ఎత్తులో నిర్మిస్తే ఎంత నీటిని వినియోగించుకునే వీలుందని సమావేశంలో అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టు కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే దాదాపు రూ.11 వేల కోట్లు ఖర్చు చేసిందని, కొన్ని ప్రాంతాల్లో కాల్వల నిర్మాణం కూడా జరిగిందన్నారు. 71.5 కి.మీ మేరకు కెనాల్ వర్క్ జరిగిందని అధికారులు వివరించా...