తుమ్మిడిహెట్టి బ్యారేజీపై మహారాష్ట్రతో చర్చలు - సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
భారతదేశం, అక్టోబర్ 23 -- ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన, అటవీ ప్రాంతాల ఆయకట్టుకు సాగునీరు అందించడమే లక్ష్యంగా తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. ఈ క్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో త్వరలో జరగనున్న కీలకమైన ద్వైపాక్షిక చర్చలకు పూర్తిస్థాయి సాంకేతిక ఆధారాలతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.
ఈ నెల 23వ తేదీ తర్వాత ప్రాజెక్టు చర్చల నిమిత్తం ఆహ్వానిస్తానని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇటీవల సూచనప్రాయంగా తెలిపిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, ఎంప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.