Andhrapradesh, ఆగస్టు 19 -- బంగాళాఖాతంలోని తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఈ మేరకు వాతావరణశాఖ ప్రకటన విడుదల చేసింది. ఇవాళ(ఆగస్ట్ 19) ఉదయానికి ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా సమీపంలో గోపాలపూర్ వద్ద తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. తీరం వెంబడి గంటకు 40-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది.

వాయుగుండం ప్రభావంతో కోస్తాలో ఇవాళ చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని వెల్లడించింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని వివరించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని.. ముఖ్యంగా మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని స్పష్టం చేసింది.

సోమవారం సాయంత్రం 5 గంటల నాటికి అల్లూరి జిల్...