భారతదేశం, డిసెంబర్ 6 -- తిరుమ‌ల‌లోని అన్నమ‌య్య భ‌వ‌న్‌లో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్యక్రమం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా 23 మంది భ‌క్తులు త‌మ స‌ల‌హాలు, సూచ‌న‌లు అందించారు. భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానం చెప్పారు.

ఆన్ లైన్ లో దివ్యాంగులకు, వృద్ధులకు ఒకే స్లాట్ ఇవ్వడంతో టోకెన్లు బుక్ చేసుకోలేకపోతున్నామని, ఆఫ్ లైన్ ద్వారా దివ్యాంగులకు టోకెన్లు కేటాయిస్తే బాగుంటుందని ఓ భక్తుడు అడిగారు. అన్ని వర్గాలవారినీ దృష్టిలో పెట్టుకుని ఆన్ లైన్ లో టోకెన్లు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా టీటీడీ ఈవో వెల్లడించారు.

నాది నీరాజనం వేదికపై భార‌తం, రామాయ‌ణం, అన్నమయ్య కీర్తన‌ల‌ను ప‌ఠించే కార్యక్రమాలు జ‌రిగేలా చ‌ర్యలు తీసుకోవాలని భక్తులు కోరారు. దీనిపై అధికారులు పరిశీలిస్తున్నారని, త్వరలో నిర్ణయం తీసుకుంటామని అనిల్ కుమార్ సింఘా...