Tirumala,andhrapradesh, ఆగస్టు 14 -- తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీల‌ను వేలం వేయనున్నారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటన విడుదల చేసింది. మొత్తం 19 లాట్ల వాచీలు ఉన్నాయి. కేవలం ఆఫ్ లైన్ ద్వారా టెండర్ కం వేలం వేయనున్నట్లు పేర్కొంది.

భక్తులు కానుకగా సమర్పించిన ఉపయోగించినవి / పాక్షికంగా దెబ్బతిన్న 19 లాట్ల వాచీలకు ఆగష్టు 18వ తేదీన ఆఫ్ లైన్ ద్వారా టెండర్ కం వేలం వేయనున్నారు. వాచీలలో టైటాన్, సిటిజెన్, సొనాటా, రాగ, టైమెక్స్ ఇతర స్మార్ట్ వాచీలు ఉన్నాయని టీటీడీ తెలిపింది.

ఆసక్తి కల్గిన బిడ్డర్లు వాచీల వేలంలో పాల్గొనవచ్చు. ఇతర వివరాలకు స్థానిక జనరల్ మేనేజర్( వేలములు) / ఏఈవో ( వేలములు), టిటిడి, హరే కృష్ణ మార్గ్ చిరిమామాను సంప్రదించాల్సి ఉంటుంది. అంతేకాకుండా తిరుపతిలో లేదా టీటీడీ ...