భారతదేశం, సెప్టెంబర్ 24 -- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. దీంతో అధికంగా రద్దీ ఉండే అవకాశం ఉంది. ఇందుకోసం పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు కీలక సూచలను చేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో పాటించాల్సిన నియమ నిబంధనల గురించి తెలియజేశారు. ఓ వైపు దసరా సెలవులు రావడంతో భక్తుల అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది.

'శ్రీవారి దర్శనం, వాహన సేవలు సరిగా సాగేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశఆం. అలిపిరి నుంచి తిరుమల వరకు భద్రతా చర్యలు పటిష్టం చేశాం. చిన్నారుల రక్షణ కోసం చైల్డ్ ట్యాగింగ్ సిస్టమ్ అమలు చేశాం.' అని ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. భక్తులు పాటించాల్సిన నియమ నిబంధనల గురించి చెప్పారు. అవేంటో చూద్దాం..

భక్తులు తక్కువ లగేజీతో తిరుమలకు రావాలి.

క్యూ పద్ధతిని కచ్చితంగా పాటించా...